భీంగల్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మొదటి రోజు భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నలుగురు అభ్యర్థుల నుండి నామినేషన్లను వచ్చాయి. మొదటి రోజు ఉదయం 10.30 నిముషాలకు ప్రారంభం అయిన నామినేషన్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొదటి రోజు బుధవారం మొత్తం 12 వార్డ్ లకు గాను నలుగురు అభ్యర్థులు వివిధ వార్డుల్లో నుండి పోటీ చేసేందుకు తమ నామినేషన్ పత్రాలను దఖాలు చేశారు. తొమ్మిదో వార్డ్ నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా మల్లెల రాజశ్రీ (లక్ష్మణ్), బీఎస్పీ నుండి తోగిటి నవీన్, 10వ వార్డ్ నుండి సంటి లత (కాంగ్రెస్), ఎనిమిదో వార్డ్ నుండి తుమ్మ రవీందర్ (కాంగ్రెస్) లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
