29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్నూర్ లో చిరుత కలకలం

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఏఈ కార్యాలయం వద్ద చిరుత పులి సంచారం కల కలం రేపింది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజన్న అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి చిరుత పులిని సంచారం చూశానని తెలిపారు. డిఆర్ఓ సుజాత ఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలు పరిశీలించి అవి చిరుత పులి పాద ముద్రలే అని నిర్ధారించారు.

. . . పులి సంచారం జుక్కల్, మద్నూర్, పెద్ద కొడపగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

. . . జుక్కల్ అడవి శాఖ అధికారి సూచన

పులి సంచరిస్తుందని జుక్కల్ అడవి శాఖ అధికారి తెలిపారు. జుక్కల్ క్షేత్ర పరిధిలోని అటవీ ప్రాంత పరిసర వ్యవసాయ క్షేత్రాల్లో చిరుత పులి సంచారం నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. జుక్కల్, మద్నూర్, పెద్ద కొడపగల్ మండలవాసులు, గ్రామస్తులు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దన్నారు. సాయంత్రం 5:30 నుండి 7:00 మధ్య వ్యవసాయ పొలాల్లో సంచరించవద్దని, రాత్రి వేళల్లో పశువులను వ్యవసాయ క్షేత్రాల్లో కట్టవద్దని, పగటిపూట కూడా వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లడం కాకుండా సమూహంగా వెళ్ళమన్నారు. చిరుత పులి గాని, దాని పాదముద్రలు గాని గమనించినట్లయితే వెంటనే అడవి శాఖ లేదా పోలీసు అధికారులకు తెలపాలని సూచించారు. చిరుత పులికి హాని కలిగించే ప్రయత్నం, విద్యుత్ కంచెలు, తీగలు, విష ప్రయోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పులి సంచారం పై వివరణ కోరగా నిజమేనని హెచ్చరిక జారీ చేసినట్లు జుక్కల్ అడవి శాఖ అధికారి తెలిపారు.

 

 

Leopard in Madnur

More articles

Latest article