29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తగ్గేదే లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మరువద్దు
  • పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
  •  పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం 

ఇందల్వాయి బతుకమ్మ :  ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తగ్గేదే లేదని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.  ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.స్థానిక ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పుష్పగుచ్చంతో శాలువా కప్పి స్వాగతించారు. అనంతరం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను సకాలంలో అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అభివర్ణించారు.తాను పిసిసి అధ్యక్షుడిగా నియమించినందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సోనియమ్మలకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీ పైన ఎన్ని ఆరోపణలు చేసిన తాము అభివృద్ధిలో వెనకడుగు వేసేదే లేదని ఆయన ధీమా వ్యక్తం  చేశారు.ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే ఇకనుండి సహించేది లేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్,సీనియర్ కార్యకర్తలు బైరీ రవి, గోవర్ధన్ రెడ్డి, మాజీ నీటి సంఘం చైర్మన్ గట్టు కడారి,మదర్, మదర్ యూత్ నాయకులు రణవీర్, లక్ష్మణ్ గంగా సాయిలు గంగారం తదితర మండల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article