నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని నాగారంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ యువ నాయకుడు షాదాబ్ ఖాన్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమద్ జాఫర్, ముకీం జూనిద్, అల్తాఫ్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.
