సదాశివనగర్, బతుకమ్మ: సదాశివనగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని మర్కల్ బైపాస్ లో న్న అశోక ఫంక్షన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేశ్ షెట్కార్ సమక్షంలో పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్ గా సంగ్యానాయక్, వైస్ చైర్మన్ గా జక్కుల రాజిరెడ్డితోపాటు సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన వారు డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేశారు.

