. . . అభివృద్ధి కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ మాత్రమే
. . . నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గోడల మీద రాతలు కాదు నిజామాబాద్ నగర అభివృద్ధి ప్రణాళికలు వేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుప్త అన్నారు. ఆదివారం నగరంలో పర్యటించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఖలీల్ వాడిలో ప్రజల సౌకర్యర్థం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా బిగాల మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఒక్క ఇటుక కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో పెట్టలేదని విమర్శించారు. రోజు రోజుకు నగరం విస్తరిస్తునందున ప్రజలకు స్వచమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా చేపట్టిన మార్కెట్ పనులను మా బీఆర్ఎస్ హయాంలో సింహ భాగం పూర్తి చేసిన ఇప్పటి ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గోడల మీద రాతలు రాయటం, శంబుని గుడి పక్కన ఉన్న దుకాణాలను తొలగించి వారికి ఈ మార్కెట్ లో షాప్స్ కేటాయించాలని ఆందోళనలు చేసి ప్రతి సారి అభివృద్ధికి అడ్డం పడ్డారని ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నా ఎందుకు దుకాణాలను తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిగా జరిగిన ఎందుకు కేటాయిస్తాలేరని అన్నారు. అభివృద్ధి పనులు చేసే ఆలోచన లేకపోయినా కనీసం ఉన్న పనులను ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు గా విజయం సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమని మాటలు చెప్పటం కాదు చేతల్లో చూపించిన చరిత్ర మాదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్నారని కానీ ఆ నిధులను తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని 100 కోట్ల నిధులు మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరై ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులను ప్రారంభించామని గుర్తు చేస్తూ ఆ పనులకు సంబందించిన జీవో కాపీలను చూపించారు. నిజామాబాద్ నగరంలో గతంలో విద్యుత్ కాంతులతో నిండిన నగరం నేడు అంధకారం ఎందుకు అయ్యిందని, చేసిన అభివృద్ధిని పనులను కనీసం నిర్వహణ చేయలేని దౌర్బాగ్య పరిస్థితి లో ఈ ఎమ్మెల్యే ఉన్నారని ఏద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఒక కానిస్టేబుల్ హత్య చేయబడ్డాడని, నిన్ననే ఒక మహిళ ఎక్సైజ్ కానిస్టేబుల్ పై వాహనంతో తొక్కించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, బీఆర్ఎస్ నగర ఆధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నూడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ ఠాకూర్, జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షహజాద్, అబ్దుల్ మతీన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

