నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
అనాథలకు అండగా, పేదవారికి తోడుగా అనే నినాదాలతో కరుణ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథలకు, నిరాశ్రయులకు, పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని సినీ నిర్మాత రేలంగి నరసింహారావు అన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ ను ఆదివారం మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదారాబాద్ లో డాక్టర్. బీ ఆర్ అంబేద్కర్ సేవ రత్న నేషనల్ అవార్డు 2026 తో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మహేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా హాస్య నటులు పొల్ల ప్రగడ జనార్ధన్ రావు (జెన్నీ), పంచాయితీ రాజ్ సంస్థ అధికారి వెంకట్ చలపతి సురేష్ బాబు, మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి రెడ్డి, దుర్గ భవాని, సంగీత నాట్య గురువు అపర్ణ, అనురాధ, సవిత తదితరులు పాల్గొన్నారు.

