ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆ తర్వాత ఓటు అడగాలని ఎల్లారెడ్డి మాజీ శాసన సభ్యులు జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం 6వ వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇంటికొచ్చి ఓటు అడిగితె ఈ బాకీ కార్డు చూపించి హామీల అమలు గురించి ఆరా తీయాలని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వచ్చి ఓటు అడిగే హక్కు లేదన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

