29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీలకు 50% సీట్లను కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 50% సీట్లను కేటాయించాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాని, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవు కాబట్టి జనరల్ స్థానాల్లో 50 శాతం సీట్లను బీఆర్ఎస్ పార్టీ కేటాయించాలని, తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని చూస్తే.. కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టుకు వెళ్లడంతో బీసీలకు న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లు దక్కకుండా పోయాయని అన్నారు. ఈ సందర్భంగా గణేష్ గుప్తా మాట్లాడుతూ ఈసారి జనరల్ స్థానాల్లో బీసీలకు దాదాపు 60 నుండి 70 శాతం సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీసీలు రాజకీయంగా ఎదగడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేయూతనిస్తుందని తెలిపారు. బీసీలకు జనరల్ స్థానాల్లో అన్ని పార్టీల కంటే ఎక్కువగా సీట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చినందుకు బీసీ సంఘ నాయకులు హర్షం వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్ ఠాకూర్, బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, బగ్గలి అజయ్, సాయి బసవ, వాసం జయ, రేఖ, పద్మ గోపాల్, మాకు రవి, బాలన్న, ఆర్టీసీ శ్రీనివాస్, ఆర్టీసీ దయానంద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article