బీసీలకు 50% సీట్లను కేటాయించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు 50% సీట్లను కేటాయించాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాని, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవు కాబట్టి జనరల్ స్థానాల్లో...