25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్తకు పదేళ్ల శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

. . . క్రూరత్వంగా ప్రవర్తించినందుకు మరో మూడేళ్ల జైలుశిక్ష

 

. . . తీర్పు వెలువరించిన నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

భార్యపట్ల క్రూరత్వంగా ప్రవర్తించి, ఆమె ఆత్మహత్య చేసుకునే విదంగా ప్రేరేపించి ఆత్మహత్యకు కారకుడైన భర్త దుంపాల గంగాధర్ కు మూడు, పదేళ్ల కఠిన కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ గురువారం తీర్పు వెలువరించారు. సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాక్లూర్ మండలం మెట్ పల్లి గ్రామ నివాసుడైన గంగాధర్ కు నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామ సాయమ్మ కు ముప్పై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాధర్ కొన్నేళ్లుగా మద్యం తాగుతు, భార్య సాయమ్మను అనుమానిస్తూ హింసిస్తు క్రూరంగా ప్రవర్తించేవాడని, ప్రతిరోజు తిడుతు, కొడుతూ, సూటిపోటి మాటలు అనేవాడని తెలిపారు. భర్తపెట్టె శరీరక, మానసిక చిత్రహింసలు భరించలేని ఆమె జీవితంపై విరక్తి చెంది 2025 మార్చి 6న భర్త బైక్ కోసం బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ తన ఒంటిపైన పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గమనించిన బంధువులు ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయమ్మ మార్చి 16న మృతి చెందింది. సదరు నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో నిర్దారించారు. బారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85 (భార్యపట్ల క్రూరత్వంగా ప్రవర్తించడం )నేరంకుగాను మూడు సంవత్సరాల జైలుశిక్ష, సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) నేరంకుగాను పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు పిపి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article