25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . పి డి ఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ నగరంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు చేపట్టాలని పి డి ఎస్ యూ నిజామాబాద్ నగర అధ్యక్షలు పవన్ కుమార్, కార్యదర్శి సాయి కుమార్ లు అన్నారు. ఈ విషయమై బుధవారం రోజు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారి (డీఐఈఓ) కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఇంటర్ ప్రైవేట్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి వసంత పంచమి పేరుతో 2026- 27 కి సంబంధించిన అడ్మిషన్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారని, విద్యార్థులను వారి తల్లిదండ్రులను రాయితీల పేరుతో అడ్మిషన్స్ చేపడుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారని, విచ్చల విడిగా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అలాగే ఫీజులను కట్టడి చేయడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఇంటర్ లో మాస్ కాపీయింగ్ ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యాశాఖ అధికారులు ముందస్తు అడ్మిషన్లను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు మనోజ్,వివేక్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article