27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలకు తీవ్రమైన నష్టం

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా,అజయ్ కుమార్ పాటిల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

తీవ్ర మూత్రపిండ గాయం అనేది కొన్ని గంటలు లేదా రోజుల వ్యవధిలో మూత్రపిండాల పనితీరు అకస్మాత్తుగా తగ్గిపోవడమేనని,  సమయానికి వైద్య సహాయం అందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశముందని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డా,అజయ్ కుమార్ పాటిల్ చ్చరించారు. నిజామాబాద్‌లో ని  మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు నెఫ్రాలజిస్ట్ డా. అజయ్ కుమార్ పాటిల్ మాట్లాడుతూ ముత్రపిండలకు సమయానికి వైద్య సహాయం అందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశముందని హెచ్చరించారు.తీవ్ర డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్లు, తక్కువ రక్తపోటు, నియంత్రణలో లేని షుగర్, రక్తపోటు, వైద్యుల సలహా లేకుండా నొప్పి నివారక మందుల వినియోగం, కొన్ని మందులు, కాంట్రాస్ట్ డైలు, మూత్రనాళ అడ్డంకులు (రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు) ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.మూత్రం తగ్గిపోవడం, ముఖం–కాళ్ల వాపు, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. రక్త పరీక్షలు (క్రియాటినిన్, యూరియా), మూత్ర పరీక్షలు, ఎలక్ట్రోలైట్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారని వివరించారు.కారణాన్ని గుర్తించి వెంటనే చికిత్స ప్రారంభిస్తే చాలా సందర్భాల్లో మూత్రపిండాల పనితీరు తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని చెప్పారు. తీవ్రమైన పరిస్థితుల్లో డయాలసిస్ అవసరం కావచ్చన్నారు.సరైన నీటి వినియోగం, స్వయంగా మందులు వాడకపోవడం, షుగర్, రక్తపోటును నియంత్రణలో ఉంచడం, ఇన్ఫెక్షన్లకు వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని డా. అజయ్ పాటిల్ సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ లో అత్యాధునిక కిడ్నీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

More articles

Latest article