29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ అభ్యర్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. .  . పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు విన్నవించిన  బీసీ సంక్షేమ సంఘం నాయకులు

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు సరిపోవు కాబట్టి జనరల్ స్థానాల్లో 50 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు బుధవారం మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు కల్పించడం హర్షణీయమే కానీ కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టుకు వెళ్లడంతో బీసీలకు న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లు దక్కకుండా పోయాయన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో 50 శాతం సీట్లను బీసీ అభ్యర్థులకు కేటాయించాలని  కోరారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన వారిలో  కొయ్యాడ శంకర్, శ్రీలత, కొట్టూర్  చంద్రకాంత్,  సాయి బసవ, బాలన్న తదితరులు పాల్గొన్నారు. 

 

More articles

Latest article