. . . యూత్ నాయకులే రేపటి ప్రజా ప్రతినిధులు
. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూంపల్లి మహేందర్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్, కో కన్వీనర్ రోషిని జైష్వాల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యూత్ నాయకులే రేపటి ప్రజా ప్రతినిధులని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను, ఘనతను ప్రజలకు వివరించాలని, దేశం కోసం త్యాగం ఎవరు చేసినారో ప్రజలకు వివరించాలన్నారు. రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, నెహ్రూ, మహాత్మా గాంధీ మహానీయులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. బిజెపి వారు భారతదేశాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివశరణ్ రెడ్డి మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులుగా గెలవడం ఎంతో సంతోషమని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో యూత్ కాంగ్రెస్ కమిటీలు వేసి గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను, సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఇంచార్జ్ కో కన్వీనర్ రోషిని జైశ్వాల్, నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్ అనుపాల్, వినోద్, సతీష్ రెడ్డి, వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
