ఇందల్వాయి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. చనిపోయిన యువకుడిని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన అనిల్ గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
