29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

హున్సా గ్రామంలో రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

. . . జీవనదాన మహాకుంభ్ కు విశేష స్పందన

 

బోధన్ బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని హున్సా గ్రామంలో ‘జీవనదాన మహాకుంభ్’ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజ్ శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. సుమారు 100 నుంచి 120 మంది యువకులు, స్వచ్ఛంద సేవకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. హున్సా గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మురిగె శంకర్, నాని, నిరీక్ష పాన్ కార్ రాజు, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కథలే, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుస్మిత బుచ్చల్వార్, మందర్న రాజు పటేల్, మాజీ జిల్లా అధ్యక్షులు జైరామ్ పటేల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం ద్వారా తలసేమియా, క్యాన్సర్, కిడ్నీ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు.

 

Blood donation camp in Hunsa village
Blood donation camp in Hunsa village

More articles

Latest article