. . . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు
మద్నూర్, బతుకమ్మ:
రేపు మద్నూర్ గురు ఫంక్షన్ హాల్లో మద్నూర్ మండల సర్పంచ్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమం తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హాజరవుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సూచించారు.
