30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన సర్పంచ్ లకు అరైవ్- అలైవ్ పై అవగాహన  సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్థానిక ఎంపిడిఓ కార్యక్రమం లో నూతన ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచులకు స్థానిక ఎస్ ఐ సునీల్ ‘అరైవ్ అలైవ్’కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎస్సై సునీల్ మాట్లాడుతూ యువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని సూచించారు. అరైవ్ అలైవ్ అనేది అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని  అన్నారు. ప్రతీ కుటుంబం ఆనందంతో  జీవించాలన్నారు. హెల్మెట్ చట్టం కాదు- ప్రాణాన్ని కాపాడే ఆయుధం అన్నారు. ఈ అరైవ్ అలైవ్ అనే ఒక నినాదంలా కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సబ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు. రహదారి భద్రత నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు మన నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్త వల్ల జరుగుతాయని, హెల్మెట్ ధరించడం అనేది కేవలం చలాన్లు చట్టం నుండి తప్పించుకోవడానికి కాదు అది మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని ప్రతీ ఒక్క వాహనదారుడు గ్రహించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాద మరణాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,పలు పలు గ్రామల సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article