25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

దడువాయి యూనియన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ సీటి, బతుకమ్మ: 

నిజామాబాద్ దడువాయి యూనియన్ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్  (శ్రద్ధానంద్ గంజ్) లో  దడువాయి యూనియన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్ ప్రమాణం చేయించారు. గౌరవ సలహాదారులుగా మల్యాల గోవర్ధన్, అధ్యక్షులుగా  ఎల్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా ఆర్ రవీందర్ గౌడ్, ప్రవీణ్  కోశాధికారిగా ఎస్ ఉమేష్,  కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించారు.

Daduwai union new committee swearing in

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఫీక్ ఖాన్ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ అనుబంధంగా దడవాయి యూనియన్ నూతన కార్యవర్గం ప్రమాణం చేయడం పట్ల అభినందనలు తెలియజేశారు, గత పాలకవర్గాలు మార్కెట్ యార్డు వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడం వల్ల దడువాయి కార్మికులకు మార్కెట్ యార్డ్ పై ఆధారపడిన కార్మికులకు ఉపాధి కరవైపోయిందని అన్నారు. దడువాయి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామని తెలియజేశారు. ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ఐకెపి సెంటర్ల నిర్వహణలో దడ్వాయి కార్మికులకు మార్కెట్ యార్డు ద్వారానే డబ్బులు చెల్లించే విధంగా కృషి చేయాలని, దడువాయి కార్మికులను స్కిల్ లేబర్లుగా గుర్తించి కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో దడువాయులకు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుమస్తా సంఘం నాయకులు సత్యనారాయణ బాల ఆంజనేయులు, హమాలి యూనియన్ నాయకులు పరశురాం శ్రీహరి, దడువా యూనియన్ సలహాదారులు కే రాజేంద్రప్రసాద్ ఎం స్వామి జివి పవన్ కార్యవర్గ సభ్యులు బసప్ప, పూజారి కృష్ణ, బండారి రాజు, ఆనంద్, శివప్రసాద్, గిల్ల సాయిలు, కొక్కు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article