నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
పేద ప్రజలు, తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు సలహాదారు పి. సుధర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై కోల్డ్ స్టోరేజ్ యూనిట్‌ను ప్రారంభించి రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడి, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు రూ.15,00,000/- వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పి. సుధర్శన్ రెడ్డి మంజూరు చేయడం పట్ల రెడ్ క్రాస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి, పేద రోగులకు అందించే సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అనంతరం, క్షయ (TB) వ్యాధితో బాధపడుతున్న 20 మంది రోగులకు పోషకాహార ఆరోగ్య కిట్లును పి. సుధర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే, రెడ్ క్రాస్ తలసేమియా వార్డులో చికిత్స పొందుతున్న తలసేమియా రోగులకు పండ్లను పంపిణీ చేసి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హమ్దాన్, డా.కవిత రెడ్డి, అరికెల నర్సారెడ్డి ,రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు,వైస్ చైర్మన్ డొల్లా రాజేశ్వర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు,నిజామాబాద్ డివిజనల్ చైర్మన్ డా. కె. శ్రీశైలం మ్యానెగింగ్ కమిటీ సభ్యులు డా. నీలి రామచందర్, సూర్య నారాయణ, డా. అబ్బాపూర్ రవి, జి. హనుమంతరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
