28.8 C
Hyderabad
Monday, August 3, 2026

  నగర పారిశుధ్యంలో బల్ధియా కార్మీకుల సేవలు మరువలేనివి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సీటి, బతుకమ్మ:

 

నగర పారిశుధ్యంలో  నిజామాబాద్ బల్ధియా కార్మీకుల సేవలు మరువలేనివి అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. బుదవారం జాతిపిత మహాత్మా గాంధీ  జయంతి సందర్భంగా గత 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హి సేవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలందించిన మున్సిపల్ కార్పోరేషన్ కార్మికులకు, చెత్త వాహనాలు నడిపే డ్రైవర్స్,  శానిటేషన్ పర్యవేక్షకులకు ప్రశంసా పత్రాలను నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి నగర మేయదర్ దండు నీతు కిరణ్  అందించారు. ఈ సందర్భంగా  వారు  మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అందించే సేవలు ఎంతో విలువైనవని నగర ప్రజల ప్రజారోగ్యం దృష్ట్య ఉదయాన్నే మేల్కొని స్వచ్ఛ నిజామాబాద్ నగరంగా తీర్చిదిద్దడానికి ఏంతో కృషి చేస్తున్నారని అన్నారు. స్వచ్చ భారత్ కార్యాక్రమంతో పాటు స్వచ్చ సర్వేక్షన్ లోను నిజామాబాద్ పోటి పడటానికి బల్ధియా కార్మీకుల సేవలు ఎంతో తోడ్పాటు అందించాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమీషనర్ మంద మకరంద్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ , అదనపు కమిషనర్ శంకర్, ఇంజనీర్లు పారిశుద్ధ్య పర్యవేక్షకులు కార్మికులు పాల్గొన్నారు

More articles

Latest article