. . టిజిఎన్పిడిసిఎల్ ( ఆపరేషన్స్ ) సిఇ అశోక్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
జిల్లాలోని నగరం, పట్టణాలతో పాటు అన్ని గ్రామాలలో వారానికి మూడు రోజులు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మంగళ, గురు, శనివారాలలో ఏఈలు వారి స్టాఫ్ తో సహా వెళ్లి ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించాలి అని టిజిఎన్ పిడిసిఎల్ వరంగల్ (ఆపరేషన్స్) సిఇ ఆశోక్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్డేన్ షిప్ సమావేశ మందిరంలో సర్కిల్ విధ్యుత్ అధికారులతో సమీక్ష సమావేశంలో సిఇ అశోక్ మాట్లాడుతూ..వారంలొ మూడు రోజులు ప్రజా బాట చేపట్టి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అని అందులో ఎస్ ఈ, డిఈ లు, ఏడీలు పాల్గొని ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి అన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ డామేజ్, లూజ్ లైన్స్, చెట్ల కొమ్ములు తొలగించడం, ఇంటి బయట అమర్చటం వంగిన పోల్స్ సరి చేయడం, మిడిల్ పోల్స్ ఏర్పాటు చేయడం, పాడైన రిపేర్ చేయుట మొదలైనవి చేయాలి అన్నారు. 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్స్ పూర్తి చేయాలి అని డి టి ఆర్ ఫెయిల్యూర్స్ తగ్గించాలి ట్రాన్స్ఫార్మర్స్ మెయింటినెన్స్ చేయాలి అని సూచించారు. మనందరం కలిసి నిజామాబాద్ జిల్లాను మన కంపెనీ లో ముందు వరుసలో ఉంచడానికి కృషి చేయాలి అని చెప్పారు .పొలం బాట, పట్టణ బాట నిర్వహించి వినియోగదారులకు భద్రత గురించి చెప్పాలని సూచించారు .విద్యుత్ సరఫరా లో అంతరాయాలు తగ్గించాలని విద్యుత్ నియంత్రికలు పాడవకుండా బాగు చేయాలని కోరారు. 33 కెవి, 11 కె.వి అంతరాయం తగ్గించాలని చెప్పారు. ఈ సమావేశంలో డి ఈ టెక్నికల్ రమేష్ ఎస్ ఏ ఓ శ్రీనివాస్, డీ ఈ లు ఎం శ్రీనివాస్,ఎండి ముక్తార్ ,రఘు, సమీక్షా సమావేశంలో ఏడిఈ లు, ఏఈలు, ఏ ఏ ఓ లు హాజరయ్యారు.

