. . . ఇద్దరు గొలుసు దొంగలు అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరం పరిధిలో ఇటీవల సుభాష్ నగర్ లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును చేయించినట్టు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. బుధవారం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ మాట్లాడుతూ… సుభాష్ నగర్ లో ఒక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ కేసులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ సిబ్బంది , 3 వ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గత 10 రోజులుగా చైన్ స్నాచింగ్ నేరస్తుల గురించి వెతికినట్టు తెలిపారు. బుధవారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కు చెందిన షేక్ మహ్మద్ కైఫ్ (25). అద్నాన్ (22) అనే ఇద్దరిని అరెస్టు చేశారు అని తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. పోలీసులు విచారణ లో గతంలో 29 డిసెంబర్ 2025 న నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధ మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని పరారైనట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడు అమన్ పటేల్ పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు .
