27.5 C
Hyderabad
Friday, July 31, 2026

సెంట్రల్ జైలు లో దిద్దుబాటు చర్యలు ఫలించేనా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జైలర్ ఉపేంధర్  సస్పెన్షన్ 

. . .  మరో జైలర్ సాయి సురేష్ బదిలీ

. . . జైలు సూపరింటేండేంట్ సెలవులో వెళ్లాలని అదేశాలు

. . . ఇంచార్జీ సూపరింటేండేంట్ గా ఆనంధ్ రావు

 నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ సెంట్రల్ జైలులో జరుగుతున్న, జరిగిన ఘటనలపై జైళ్ల శాఖ సిరియస్ యాక్షన్ కు దిగింది.సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదిలు చాకలీ రాజు, కర్నేలింగంలను జైలు అధికారులు చితక బాదిన ఘటనపై చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ జైలులో గంజాయి రాక, దాని వినియోగం, ఖైదిలకు వాటి సరఫరా, ఇద్ధరు ఖైదిలను జైలు అధికారులు చితక బాదిన ఘటనపై సిరియస్ అయింది. ఈ నెల 3న జైళ్ల శాఖ డిఐజి, ఐజీలు సంపత్, మురళిబాబులు విచారణ జరపి జైళ్ల శాఖ డిజీపికి నివేధిక సమర్పించారు. ఈమేరకు డిజిపి కార్యలయం నుంచి నిజామాబాద్ సెంట్రల్ జైలు జైలర్ ఉపేంధర్ పై సస్పెన్షన్ వేటు వేయగా, మరో జైలర్ సాయి సురేష్ ను అదిలాబాద్ సబ్ జైలుకు బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటేండేంట్ గా పనిచేస్తున్న చింతల ధశరథం ను సెలవులో వెళ్లాలని సిఫారసు చేసినట్లు తెలిసింది.  నిజామాబాద్ సెంట్రల్ జైలు డిప్యూటి సూపరింటేండేంట్ కున ఆనంధ్ రావును ఇంచార్జీ సూపరింటేండేంట్ గా నియమించారు.  ఇద్ధరు జైలర్ ల స్థానంలో కోత్తవారిని నియమించలేదు..

 నిజామాబాద్ సెంట్రల్ జైలులో ప్రక్షళన జరిగినట్టేనా?

జిల్లా జైలు నుంచి సెంట్రల్ జైలుగా అప్ గ్రేడ్ అయిన నిజామాబాద్ సెంట్రల్ జైలు వివాదాలలో చిక్కుకోవడం ఇది కోత్తకాదు. సెంట్రల్ జైలు నిర్మాణంలోనే మొరంను అమ్ముకోని లక్షల  రూపాయలు సంపాధించారు కోందరు జైలు అధికారులు. ఇంక జైలులో ఖైదిల నుంచి డబ్బులు వసూలు ఎలా చేయాలో సెంట్రల్ జైలు అధికారులను అడిగి తెలుసుకోవాల్సిందే.సెంట్రల్ జైలులోఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు.నిజామాబాద్ సెంట్రల్ జైల్ లో జరుగుతున్న వరుస ఘటనలు ఇలాగే ఉన్నాయి.జైలు సిబ్బందే ఖైదీ లకు మత్తు పదార్థాలు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.చుట్టూ ప్రహరీ గోడ కట్టుదిట్ట మైన భద్రత నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ జైలు లోకి బీడీ, సిగరెట్ గుట్కా, గంజాయి వంటివి ప్రవేశించడం పట్ల ఉన్నదికారులు సీరియస్ గా ఉన్నప్పటికి అధికారులు మారుతారా అనే చర్చ జరుగుతుంది...

సెంట్రల్ జైలులో వసూళ్లు అగేనా?

నిజామాబాద్ సెంట్రల్ జైలు లో వసూళ్ల  అదికారుల అవినీతి బహిర్గతం చేసిన దానిపై జైళ్ల శాఖ సిరియస్ గా వ్యవహరించలేదన్న చర్చ జరుగుతుంది. సెంట్రల్ జైలు సూపరింటేండేంట్ ను సెలవులో పంపడం, ఓక జైలర్ పై వేటు, మరోకరిపై బదిలీ వేటు వేయడానికి ఇటివల గంజాయి కలకలం అనే విషయం తెలిసిందే. జైలులో అధికారులు సిబ్బంది అయి ఖైదిల నుంచి డబ్బుల వసూళ్లకు అలవాటు పడ్డారు. ప్రధానంగా ములాఖాత్ లు మొదలుకోని ఖైదిలను బ్యారక్ లో ఉంచుతామని ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. అదికారులు బరి తెగించి పోన్ లను చేసి మరి ఖైదిల కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేయిస్తున్న ఘటనలు కోకోల్లలు. జైలును కోందరికి అత్తారిల్లుగా మార్చి సకల బోగా భాగ్యాలను కల్పించి గిప్ట్ లు, కాసులను నోక్కేస్తున్నారు.ఇక కోందరు రిమాండ్ ఖైదిలకు విఐపి ట్రీట్ మెంట్ కల్పించడానికి వసూళ్లు  చేస్తున్న ఘటనలు కోకోల్లలు. జైలు గోడల కంటే ఆసుపత్రులకు వైధ్యం పేరిట సీఫారసులు కుడా జైలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎకంగా ఎసిబి నజర్ వేసిన అధికారులు వెనక్కి తగ్గడం లేదు. పోలిస్ అధికారులు కుడా జైలు అధికారులకు గిప్ట్ లు ఇవ్వాలంటే అతిశయోక్తి కాదంటా. జైళ్ల శాఖ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే అవినీతి మరకలు తోలిగేలా లేవు..

 

 

More articles

Latest article