. . . సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే ధన్ పాల్ విజ్ఞప్తి
నిజామాబాద్, బతుకమ్మ :
గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సిడిపీ నిధులను తక్షణమే విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నిజామాబాద్ నగర శాసన సభ్యులు ధన్ పాల్ సూర్య నారయణ, సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. అసెంబ్లి సమావేశాల ఆనంతరం సచీవాలయంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి అర్బన్ నియోజకవర్గంలో 20-25 ఎకరాల స్థలం లభించడం కష్టంగా ఉన్న నేపథ్యంలో 10- 12 ఎకరాల్లోనే ఏర్పాటు చేసే వెసులుబాటును పరిశీలించాలని కోరారు. అమృత్ పథకం కింద కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ వర్క్స్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వాటిని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.నిజాబాబాద్ జిజిహెచ్ కు రోజూ సుమారు 2,000 కు పైగా అవుట్ పేషెంట్లు వస్తుండగా సిబ్బంది కొరత వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకొని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. గతంలో మంజూరైన నిజామాబాద్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని, అలాగే 2015లో దరఖాస్తు చేసుకున్న ఇండ్లు లేని నిరుపేదలకు పెండింగ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని కోరడం జరిగింది. కళాభవన్‌కు అదనంగా రూ.66 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే, బస్టాండ్ ఆధునీకరణకు మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
