. . . జైలర్ ఉపేంధర్ సస్పెన్షన్
. . . జైలర్ సాయి సురేష్ బదిలీ
. . . జైలు సూపరింటేండేంట్ సెలవులో వెళ్లాలని అదేశాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ సెంట్రల్ జైలులో జరుగుతున్న, జరిగిన ఘటనలపై జైళ్ల శాఖ సిరియస్ యాక్షన్ కు దిగింది.సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదిలు చాకలీ రాజు, కర్నేలింగంలను జైలు అధికారులు చితక బాదిన ఘటనపై చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ జైలులో గంజాయి రాక, దాని వినియోగం, ఖైదిలకు వాటి సరఫరా, ఇద్ధరు ఖైదిలను జైలు అధికారులు చితక బాదిన ఘటనపై సిరియస్ అయింది. ఈ నెల 3న జైళ్ల శాఖ డిఐజి, ఐజీలు సంపత్, మురళిబాబులు విచారణ జరపి జైళ్ల శాఖ డిజీపికి నివేధిక సమర్పించారు. ఈమేరకు డిజిపి కార్యలయం నుంచి నిజామాబాద్ సెంట్రల్ జైలు జైలర్ ఉపేంధర్ పై సస్పెన్షన్ వేటు వేయగా, మరో జైలర్ సాయి సురేష్ ను అదిలాబాద్ సబ్ జైలుకు బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటేండేంట్ గా పనిచేస్తున్న చింతల ధశరథం ను నెలరోజుల సెలవుకుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ సెంట్రల్ జైలు డిప్యూటి సూపరింటేండేంట్ కనక ఆనంధ్ రావును ఇంచార్జీ సూపరింటేండేంట్ గా నియమించారు. ఇద్ధరు జైలర్ ల స్థానంలో కోత్తవారిని నియమించలేదు..
