25.5 C
Hyderabad

ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య 

Must read

📰 Generate e-Paper Clip

నంద్యాల, బతుకమ్మ :  ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర (35), మన ముగ్గురు పిల్లలు కావ్య శ్రీ (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్, (2) లకు కూల్ డ్రింక్ లో విషం కలిపి తాగించాడు. అనంతరం తాను ఉరి వేసుకున్నాడు. ఆగస్టు 16న సురేంద్ర భార్య మహేశ్వరి (32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న సురేంద్ర ఈ ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

 

 

More articles

Latest article