29.7 C
Hyderabad

డీసీసీ, టౌన్ అధ్యక్షులకు సన్మానం 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడిని నగరంలో వర్ని చౌరస్తాలో గల తన ఇంట్లో  డీసీసీ అధ్యక్షుడు కాటేపల్లి నగేశ్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి రామకృష్ణలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కృపాల్ సింగ్ సోడి  వారిని శాలువాతో సన్మానించారు. డీసీసీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మీ సేవలు అవసరమని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి  కృషి చేయాలని సోడిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి రామకృష్ణ, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గన్ రాజ్, పంచ రెడ్డి చరణ్, 50వ డివిజన్ ఇంచార్జ్ అవిన్ మరియు నరేందర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు సుఖ్వీందర్ సింగ్, ఆర్టీసీ నరేందర్ సింగ్, దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article