24.1 C
Hyderabad
Monday, August 3, 2026

శంభుని గుడి లో చోరికి నిర్లక్ష్య విధులకు  ఈవో సస్పెండ్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

– దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

చారిత్రాత్మక అత్యంత పురాతన శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో పట్టపగలే జరిగిన దొంగతనం దేవాలయం ఈవో నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది దానికి బాధ్యుడిని చేసి అతడిని సస్పెండ్ చేయాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం శంభుని గుడి ఆలయం లో చోరి జరిగిన ప్రాంతంను పరిశీలించారు. ఈ సంధర్బంగా  పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ….శంభుని గుడి ఆలయం చుట్టూ ఉన్న స్థలాన్ని అన్యమతస్తులు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసిన తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి గత ఐదు సంవత్సరాలుగా నిరంతర ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు.ఇంతలోనే జరిగిన ఈ దొంగతనం దేవాలయ రక్షణలో దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష సాక్షిగా కనబడుతున్నది, దేవాలయం ఈవో గా ఉన్న వ్యక్తి ఆలయ రక్షణ మరియు నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసి తనకు వేరే ఆలయాలు అదనపు ఛార్జ్ ఉంది అని చెప్పి విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యపు సమాధానం లు చెప్పడం సరికాదు అన్నారు. దేవాలయం నిర్వహణలో ఈవో పూర్తిగా విఫలమైంది వల్ల పట్టపగలు ఆలయంలోని పూజా సామాగ్రి దొంగిలించబడిందని  అన్నారు.ఆలయ నిర్వహణలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి అందువల్ల ఈవో ని వెంటనే సస్పెండ్ చేసి పూర్తిస్థాయి ఈవోను నియమించాలని, రాత్రి ,పగలు కోసం ఇద్దరు వాచ్ మెన్ ను నియమించిన నిరంతరం దేవాలయానికి రక్షణ కల్పించాలని దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి  సభ్యులు స్వామి, కిషన్, రామరాజు, నాని, రాహుల్ ,ప్రతాప్, యోగేష్, తదితరులు పాల్గొన్నారు.

The EO should be suspended for negligence in duties after stealing from Shambhu temple

More articles

Latest article