28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కృష్ణ జలాల విషయంలో తెలంగాణ ద్రోహి కేసీఆరే

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  కేసీఆర్ మీద సీఎం రేవంత్ వాడిన భాష సరైంది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లో గురువారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు.  రేవంత్ చేసిన వాఖ్యలు ఇద్దరి మధ్య ఒప్పందంలో భాగమా, కావాలనే కేసీఆర్ పై  సింపతీ కలిగేలా చేస్తున్నారా? అని  ప్రశ్నించారు?. కృష్ణ జలాల విషయంలో తెలంగాణ ద్రోహి కేసీఆరే అని ఆరోపించారు.  కేటీఆర్ కి  ఇంకా అహంకారం తగ్గలేదన్నారు.  తెలంగాణకు 570 టీఎంసీల నీళ్లు రావాలని స్పష్టం చేశారు.  కేసీఆర్ 299 టీఎంసీల ఒప్పందం వెనక కుట్రలు బయటకు రావాలని డిమాండ్ చేశారు.  జగన్ కు, కేసీఆర్ మధ్య ముడుపుల బిజినెస్ జరిగిందని ఆరోపించారు.  ఏపీకి కృష్ణా జలాలను కేసీఆర్  తాకట్టు పెట్టరాని విమర్శించారు.  కేసీఆర్ కంటే పెద్ద శని ఎవరూ ఉండరని బండి వ్యాఖ్యనించారు.

 

 

More articles

Latest article