. . . పోలీస్ బాస్ సెలువు లో ఉన్నప్పుడు ఎస్సైల బదిలీ ఉత్తర్వులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సెలవులో ఉన్నప్పుడు ట్రాన్స్ ఫర్ లు జరగడం విశేషం. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీల జరగడం గమనార్హం. భీంగల్ ఎస్ హెచ్ వో పని చేస్తున్న సందీప్ ను నాలుగో టౌన్ ఎస్సై గా బదిలీ చేశారు. నాల్గవ టౌన్ లో ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్ ను నవీపేట్ కు బదిలీ చేశారు. వర్ని ఎస్ఐగా పనిచేస్తున్న ఉడతల మహేష్ ను వీఆర్ కు బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న వంశీకృష్ణను వర్ని ఎస్సైగా బదిలీ చేశారు.
