27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికల సిబ్బంది కి న్యాయ బద్దంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . ఆర్డీవో పార్థసారథి రెడ్డి కి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య వినతి

బాన్సువాడ, బతుకమ్మ :

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కామారెడ్డి జిల్లా శాఖ తరపున కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసారథి రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. మంగళవారం బీర్కూర్ మండలం లో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎన్నికల సిబ్బంది సంబంధించిన సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చైర్మన్ పంపరి ప్రవీణ్ కుమార్ , కో చైర్మన్ ఎన్ సి ప్రభాకర్ విన్నవించారు. పి ఓ స్టేజ్ 2 అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరారు. రిజర్వ్ కేటగిరి ఎన్నికల సిబ్బందికి కూడా రెమ్యూనరేషన్ చెల్లించాలి. అధిక సంఖ్యలో ఓట్లు కలిగిన పోలింగ్ స్టేషన్లకు అదనంగా పోలింగ్ సిబ్బందిని నియమించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో  ఆర్డీవో  తెలపడం జరిగిందన్నారు. అనారోగ్యం తో భాద పడు సిబ్బంది కి ప్రత్యామ్నాయం గా రిజర్వ్ వారికి డ్యూటీ అలట్ చేసి సహకరించినందుకు గాను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చైర్మన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో పంపరి ప్రవీణ్ కుమార్, చైర్మన్, ప్రభాకర్ కో చైర్మన్,కిషోర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article