27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సోమర్ పేట  గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి మండలం  సోమర్ పేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం చోటు చేసుకుంది.  ఆదివారం జీపీ ఎన్నికల్లో  గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవి ఓడిన అభ్యర్థి బాలరాజ్ ను ట్రాక్టర్ తో ఢీ కొట్డాడు.  ఈ ప్రమాదంలో బాలరాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే  గంజి భారతి, బాలమణి, స్వరూప , పద్మ సత్యవ్వ గాయపడ్డారు.  నా మీద పోటీ చేస్తారా మీరు అంటూ ప్రత్యర్థి ఇంటికి వెళ్లి బాలరాజు కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. ఈఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేక తప్పిదంతో జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై సోమర్ పేట గ్రామస్తులు రాస్తోరోకో చేపట్టారు.

More articles

Latest article