29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

. . . ఫీట్స్ వచ్చిన మహిళకు సపర్యలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నగరంలో ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్న పోలిసులు విధి నిర్వహణ తో పాటు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లు ఆర్. డి రమేష్, పె ద్దన్న, శ్రావణ్ ,హోంగార్డు శాకీర్ లు రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక మహిళ అకస్మాత్ గా ఫీట్స్ వచ్చి పడిపోయింది. గురువారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది సపర్యలు చేసి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమె భర్త ద్వారా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తగిన చికిత్స నిమిత్తం తరిలించారు. ఫిట్స్ వచ్చి పడిపోయిన మహిళను సపర్యాలు చేసి ప్రాథమిక చికిత్స నిమిత్తం హాస్పిటల్కు పంపినటువంటి ట్రాఫిక్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. అలాగే మంచి పనిని గుర్తించిన ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వారిని అభినందించారు.

More articles

Latest article