. . . మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ:
వేల్పూర్, బతుకమ్మ:
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్గట్ల మండలం దొంచంద,వేల్పూర్ మండలం కొత్తపల్లి, హనుమాన్ నగర్ గ్రామ. సర్పంచ్ లు, పాలకవర్గం సభ్యులు బుధవారం వేల్పూర్ లోని నివాసంలో శాసన సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదసపూర్వకంగ కలిశారు. ఈ సందర్బంగా వారికీ శుభాకాంక్షలు తెలియజేసి సర్పంచ్ లను, పాలకవర్గం వార్డ్ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సన్మానించి సత్కారించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజలు ఇచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకొని గ్రామభివృద్ధికి నిరంతరం. కృషి చేయాలనీ ఎమ్మెల్యే వారికీ సూచించారు. ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన పెదకాపుల శ్రీనివాస్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో వారిని వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నూతుల విజయ సర్పంచ్ గా, ఉప సర్పంచ్ నూతుల కృష్ణారెడ్డి పాలక వర్గము ఏకగ్రీవంగా ఎన్నికైంది. వేల్పూర్ మండలం హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో సర్పంచ్ గా నడ్పి మల్లయ్య, ఉప సర్పంచ్ గా మణి పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్యే వేముల సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
