25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రొటోకాల్ ఉల్లంగణ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేస్తున్నారని జిల్లా డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు.  జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాల్కొండ నియోజకవర్గ పర్యటన సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన సరికాదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ తీస్తున్నదాని, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే లేకుండానే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారనీ పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కావాలనే ప్రభుత్వం విపక్ష ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగిస్తోందనీ తెలిపారు. సెప్టెంబర్ 30 నాడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి సంవత్సరికం కార్యక్రమం ఉన్నదని ఇంకో రోజు కార్యక్రమాలు పెట్టుకోవాలని తెలిపిన ఎమ్మెల్యే కార్యక్రమాలకు రాకుండా చేయడానికి అదే రోజు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమే ఉద్దేశ్యపూర్వకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారనీ అనడానికి నిదర్శనం. ప్రోటోకాల్ ఉల్లంగణ జరగటానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కారణం. అలాగే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉండగా ఈ రోజు సొంత మండలం వేల్పూర్ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ప్రోటోకాల్ ప్రకారం కనీసం ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వలేదు. గత మూడు రోజుల క్రితమే ప్రభుత్వం సోయా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని,ప్రవేట్ వ్యాపారులకు పంట అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది అని అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం తప్పదని అన్నారు. అధికారం ఎప్పుడు ఒకలా ఉండదని మారుతూ ఉంటుందని ,రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వానికి ఇంతకు ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏరియా, పూర్ణానందం, రేగుంట దేవేందర్, ముసుగు భూమేశ్వర్, నాగాదర్ రెడ్డి, మాజి జెడ్పిటిసి బద్దం రవి,సొసైటీ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి,ఆనంద్,మోహన్ రెడ్డి,గోపిడి సత్యనారాయణ, ఇంతియాజ్,గంధం మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article