29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వామపక్షాలు బలపరిచిన అభ్యర్థి రమాదేవి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నవిపేట్, బతుకమ్మ :

ఆర్.ఎస్.పి, సిపియం, సిపిఐ, సిపిఐ( ఎంఎల్), మాస్ లైన్, ప్రజా వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు బలపరిచిన నవీపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రమాదేవి ని అత్యధిక మెజార్టీతో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కఠారి రాములు కోరారు. అదివారం నవిపేట్ మండల కేంద్రంలో రమాదేవి గెలుపుకొసం కటారీ రాములు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ పి నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ. . .  గత కొన్ని దశాబ్ద కాలంగా కార్మిక, కర్షక, నిరుపేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాటం చేసిన వ్యక్తులను ప్రజలు ఆదరించి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బెజగం సుజాత, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిరిపలింగం, కెవిపిఎస్ నాయకులు నల్వాల నరసయ్య, నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్ శివ విలాస్ తదితరులు పాల్గొన్నారు.

Ramadevi, the candidate supported by the Left parties, should be elected with a large majority.

More articles

Latest article