పంచ పరివర్తన్ కళల మాధ్యమం ద్వారా దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

0 9,673

 

. . . సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

దేశంలో జరుగుతున్న మార్పులు, రాబోయే కాలంలో విద్యా విధానంలో వచ్చే నూతన మార్పుల గురించి పంచ పరివర్తన్, కళల మాధ్యమం ద్వారా దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్ ఉద్దేశించి  అన్నారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో ఆనంద్ పరివార్ మేళ  ఆదివారం స్థానిక సాహితీ విద్యానికేతన్ బోర్గాం ( పి ) లో  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి సంస్కార భారతి తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి జేపీ నిరంజన్  మాట్లాడుతూ… దేశం సంస్కృతి కాపాడేందుకు అందరు కంకణబద్ధులు కావాలని అన్నారు. దానికై వ్యవస్థలో వస్తున్న మార్పులతో పాటు వేశ, భాషలు కూడా మనం అర్థం చేసుకోవాలని అన్నారు. మన సంస్కృతి సామాజిక మాద్యమాల ద్వార జరుగుతున్న చెడు ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు పాటలతో అలరించారు. మ్యాజిక్ తో రంగనాథ్ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు రాజకుమార్ సుబేదార్, ప్రాంత కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి , కన్వీనర్ శంకర్ , కందకుర్తి ఆనంద్ ,సాయి రెడ్డి, ప్రచార  ప్రముఖ్ బెజగం శ్రీకాంత్ ,మాతృశక్తి కన్వీనర్ మాధురి, వరలక్ష్మి, శ్రీలత, బున్ని మల్లేష్, సంస్కార భారతి సంస్థ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.