నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : డిచ్ పల్లి మండలం నక్కల గుట్ట తండా గ్రామ పంచాయతీ లో లకావత్ దేవి సింగ్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవ ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. ఈసందర్భంగా సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని ఎమ్మెల్యే భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ లకవత్ దేవి సింగ్, ఉప సర్పంచ్
అంగోత్ సురేందర్, వార్డు సభ్యులు శ్రీనివాస్,చాంగు భాయి,లలితా బాయి రవి, సావిత్రి,చాంగు బిల్లా లకావత్, మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్ , గ్రామ పెద్దలు చందర్ నాయక్, రమేష్ నాయక్, నారాయణ ముని రామ్, రవి నాయక్ సుదర్శన్ మోబి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నక్కలగుట్ట తండా సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవం
