నక్కలగుట్ట తండా సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : డిచ్ పల్లి మండలం నక్కల గుట్ట తండా గ్రామ పంచాయతీ లో లకావత్ దేవి సింగ్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవ ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. ఈసందర్భంగా సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు...