కోటగిరి, బతుకమ్మ : తనను ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోటగిరి సర్పంచ్ అభ్యర్థి మర్ల మధుకర్ పేర్కొ న్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ల మధుకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతానని అన్నారు. కోటగిరి గ్రామ ప్రజలు ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాహిద్, మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్,కొల్లూర్ కిషోర్,విఠల్ గౌడ్, సంజీవ్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
