29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మార్కెట్ తరలించాలని అఖిలపక్షం ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

  • భీంగల్ లో ఉద్రిక్తత

 

 భీమ్‌గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టనంలో గల వ్యాపార సంస్థలకు, ట్రాఫిక్ అంతరాయంగా మారిన కూరగాయల మార్కెట్ ను తరలించాలని వ్యాపారులు, అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రోడ్డు పై అడ్డంగా బైఠాయించారు. గత మూడు, నాలుగు నెలల నుండి మార్కెట్ ను పాత తహసీల్ ఆఫీస్ ఆవరణలో కి తరలించాలని డిమాండ్ చేస్తు, ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు, వినతులు చేసినా అధికారులు మార్కెట్ తరలింపు లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కూరగాయల వ్యాపారులు వ్యాపార దుకాణల  ఎదుట వారి కూరగాయల, పండ్ల వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఇబ్బంది చేస్తున్నారని అక్కడి వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటు ట్రాఫిక్ కు ఇబ్బంది చేస్తున్నారని, విసుగు చెందిన వ్యాపారులు అఖిల పక్షం సహకారం తో ఆందోళన కు దిగారు. మున్సిపల్ కమీషనర్ తీరును నిరసిస్తూ,  కూరగాయల వ్యాపారులకు వంత పడుతున్నట్టు ఆరోపణలు చేశారు.

All-party dharna to move the market

ఈ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం అంగడి కావడంతో అంగడిలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వచ్చిన వారిని  వచ్చినట్లుగా పాత తహసీల్ ఆఫీస్ ఆవరణకు కు తరలించారు. చిన్న, చిన్న షాప్ ల వారు ఆందోళన కారుల వినతి మేరకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కి వెళ్ళగా, మరి కొందరు అధికారుల ఆదేశాల మేరకు షాప్స్ తీసేందుకు అంగీకరించారు. తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణ, ఎస్సై లు కే.సందీప్, రాము, అనిల్ రెడ్డి, రాజేశ్వర్ ల ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు. కూరగాయల మార్కెట్ తరలింపు డిమాండ్ చేస్తూ సాగిన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. మార్కెట్ తరలింపులో భాగంగా నలుగురు వ్యాపారులు తమ దుకాణాలు తరలించేందుకు ససేమిరా అని మొండి కేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసిస్టెంట్ కలెక్టర్ జోక్యం చేసుకుని పలుమార్లు వ్యాపారులు, నాయకులు, కూరగాయల విక్రయ దారులతో చర్చించారు. సమస్య పరిష్కారం కొరకు సహనం వహించాలని సూచించారు. సమస్య సున్నితం అయినందున ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులతో వారి సమస్య గురించి చర్చించారు. సాయంత్రం ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి భీమ్‌గల్ కు చేరుకొని, జాయింట్ కలెక్టర్ కరోలిన్ చింగ్ధియన్మావి, సీఐ, ఎస్సై లు షాప్స్ తరలించేందుకు ససేమీరా అని కూర్చున్న నలుగురు వ్యాపారులతో మరోసారి చర్చలు జరిపారు.ఇద్దరు వ్యాపారులు వారు తీసుకున్న మడిగేల లోపల మాత్రమే కూరగాయలు విక్రయించుకునేందుకు అంగీకారం తెలుపగా మిగితా ఇద్దరు వ్యాపారులు మెడికల్, సుమంగళి బట్టల దుకాణం అనుకుని ఏర్పాటు చేసిన వారు మొత్తం తొలగించి, నూతన మార్కెట్ కు వెళ్లేలా ఆదేశాలు జారిచేశారు. మెడికల్, సుమంగళి షాప్ ల ను ఆనుకుని ఏర్పాటు చేసిన షాప్స్ తొలగించకుంటే మెడికల్, బట్టల దుకాణం యజమానుల పై కేసు నమోదు చేస్తానని ఏసీపీ హెచ్చరించారు. మార్కెట్ తరలింపు లో వ్యాపారులకు మద్దతుగా అన్ని పార్టీ ల నాయకులు తరలి వచ్చారు.వ్యాపారులకు మద్దతూ ప్రకటించినట్టు నటిస్తూనే ఒక పార్టీ నాయకులు కూరగాయల షాప్ లను తొలగించవద్దని ఒక వైపు, తొలగించాలని మరో వైపు డబుల్ గేమ్ ఆడినట్టు ప్రచారం జరిగింది. ఈ మార్కెట్ తరలింపు పట్టణం లో సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం తెచ్చింది. చివరికి అధికారులు జోక్యం చేసుకుని సమస్య ను సున్నితంగా పరిష్కరించడంతో సమస్య సుఖాంతమైంది.

All-party dharna to move the market

More articles

Latest article