24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా సితారే క్షవీణ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షలుగా సితారే క్షవీణ్ (రాజు) ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఆదివారం నిజామాబాద్ జిల్లా మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మీసేవ అపరేటర్స్ అసోసియేషన్ ఆపరేటర్ ఎన్నికలు నిజామాబాద్ లో నిర్వహించడం జరిగిందని ఎన్నికల అధికారులు ప్రముఖ న్యాయవాది శ్యామ్ కుమార్, రిటైర్డ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ కాలేవార్ రవి  తెలిపారు. ఈ నెల 26 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ లను స్వీకరించినట్లు తెలిపారు. నామినేషన్ ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల కోసం 30న ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 240 కి పైగా మీసేవ నిర్వాహకుల్లో 151 మంది ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎలక్షన్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఇందులో 151 ఓట్లలో సితారే క్షవీన్ (రాజు )కు 129 ఓట్లు దక్కించుకోగా అతని ప్రత్యర్థి గోపి కి 21 ఓట్లు రాగా, ఓక ఓటు చెల్లలేదని తెలిపారు. జిల్లా మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యక్షునిగా సితారే క్షవిణ్ (రాజు) ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల కమిటీ నిర్వాహకులు గూడూరి శేఖర్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ షాహిద్, కుందేన్ ప్రభుదాస్, టి.శివప్రసాద్ లు పేర్కొన్నారు. మీసేవ యూనియన్ ఆపరేటర్ అసోసియేషన్ జిల్లా ఎన్నికల లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల నుండి మీసేవ నిర్వాహకులు పెద్ద ఎత్తున రావడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం గెలుపొందిన క్షవిన్ (రాజు)ను గజమాలతో సత్కరించి బాణాసంచాలు పేల్చి మీసేవ కమిటీ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sitare Kshaveen appointed as district president of Meeseva Operator Association

More articles

Latest article