23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

రియాజ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జీతో విచారణ జరిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ సంఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే న్యాయవిచారని జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వాన్ని విధాలు ఆదుకోవాలని, వారి పిల్లలకు ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రమోద్ చిన్న కుమారుడిని, ప్రమోద్ తల్లికి అనారోగ్యానికి గురై ఉన్నారన్నారు. వారికి సరైన వైద్య సౌకర్యం ప్రభుతమే కల్పించాలన్నారు. పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన రియాజ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని, పోలీసు అధికారుల నిర్లక్ష్యం వలనే రెండు నిండు ప్రాణాలు పోయాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణరావు, రాష్ట్ర నాయకులు వి.సంగం, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలయ్య, అల్గోట్ రవీందర్, నిజామాబాదు  జిల్లా  కార్యదర్శి జలంధర్, సీనియర్ నాయకులు, న్యాయవాదులు ఎడ్ల రాము, వీరభద్రప్ప  పాల్గొన్నారు.

More articles

Latest article