23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అందరి ఆశీస్సులతో డిసిసి గా నియమితులయ్యా

Must read

📰 Generate e-Paper Clip

… కాటిపల్లి నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

అందరి ఆశీస్సులతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైనట్లు నగేష్ రెడ్డి తెలిపారు. శనివారం అయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగేష్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1న నగరంలోని లక్ష్మి కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ఏఐసిసి, పీసీసీ, నిజామాబాద్ ఎమ్మెల్యేలు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు.ప్రమాణ స్వీకారానికి పీసీసీ అధ్యక్షలు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు హాజరవుతారని అన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నాయకులు జావిధ్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article