27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ భయం..

Must read

📰 Generate e-Paper Clip

  • బినామీ దందాల నిర్వాహకుల నుంచి వసూలు ఎలా..?
  • నౌకరినామ ఇచ్చేందుకు ప్రతి సీజన్లో లక్షల బేరసారాలు
  • ఎక్సైజ్ శాఖలో వసూళ్ల బాధ్యతలు లోకల్ బాస్ లకు

 

నిజామాబాద్ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ దూకుడు పెంచింది.. ప్రధానంగా ప్రభుత్వానికి ఆదాయం అందించే శాఖలపైనే అవినీతి నిరోధక శాఖ నజర్ వేసింది.. ఇటీవల కాలంలో వరస దాడులతో హడలెత్తిస్తోంది. ప్రధానంగా విద్యా, వైద్యం, సంక్షేమ శాఖల పైన దృష్టి పెట్టింది. అదే సమయంలో అవినీతికి కేరాఫ్ గా నిలిచే శాఖలుగా పేరు ఉన్న రవాణా శాఖ, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, రెవిన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖలపై ఉక్కు పాదం మోపుతోంది. ఇటీవల వరుసగా దొరుకుతున్న అధికారులంతా కీలక ప్రభుత్వానికి ప్రధానంగా నింపే శాఖల అధికారులు సిబ్బంది కావడం విశేషం. పెద్ద చేపల కోసం ఏసీబీ కాచుకు కూర్చుంది. ఈ వ్యవహారం ఎక్సైజ్ శాఖను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

2025-27 నూతన ఎక్సైజ్ మద్యం పాలసీ ప్రకారం మద్యం అమ్మకాలు డిసెంబర్ 1న ప్రారంభం కానున్నాయి. గడిచిన నెలలో లక్కీ డ్రాల ద్వారా టెండర్లను నిర్వహించిన అబ్కారి శాఖ లైసెన్స్ కేటాయించింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని 152 దుకాణలలో లిక్కర్ సేల్ అదృష్ట ప్రకారం దక్కిన దానిపై సిండికేట్ మాఫియా పడగ చూపుతోంది. మద్యం దుకాణాలను కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఉమ్మడి జిల్లాలో 152 మధ్యo దుకాణాలకు గాను దక్కించుకున్న వారు దాదాపు అమ్మేసుకున్నారు.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక మండల కేంద్రంలోని లిక్కర్ షాప్ అక్షరాల కోటి 45 లక్షలకు అమ్మకం జరిగింది. నిజామాబాద్ నగర నడిబొడ్డున నీలకంఠేశ్వరుని సమీపంలోని ఒక లిక్కర్ షాప్ ఏకంగా కోటి 25 లక్షలకు అమ్మేశారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు మద్యం దుకాణాలు అమ్మకాలకు కోటి కి పైగా వెచ్చించడం మద్యం మాఫియా కింగ్ లకే చెల్లింది..

లిక్కర్ మాఫియా లైసెన్సులను అంగడి సరుకుల మాదిరిగా కొనుగోలు చేసింది. అయితే అబ్కారి శాఖ లిక్కర్ కొనుగోలు అమ్మకాలకు ”’ నౌకరి నామా ” లను తీసికొనే సమయం లో కాసులను పిండుకోవడం ఎక్సైజ్ కు కొట్టినపిండి. గతంలో బినామీలు ఎవరు కొనుగోలు చేశారు నిర్వాణ అనేది పక్క సమాచారం ఉండేది ఎక్సైజ్ అధికారులకే. వారు దానిని సొమ్ము చేసుకొని ఒక్కో షాప్ కు రూ.2 లక్షలు వసూల్ చేసారు. ఇప్పుడు ఏసీబీ భయంతో వసూలు వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. నౌకరి నామ ఇవ్వగానే హడావిడి చేస్తే ఏసీబీకి దొరికిపోతామని భయం అధికారులలో నెలకొంది. డబ్బులు వసూలు ఏ విధంగానైనా చేయవచ్చని ప్రస్తుతం వాటికోసం ఒత్తిడి తేవద్దని స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. అయితే ఖచ్చితంగా వసూళ్లను జరపాలని వాటిని సంబంధిత స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు ఎక్సైజ్ శాఖ అంతా కోడైకూస్తుంది.

More articles

Latest article