28.2 C
Hyderabad

ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ లో నిర్వహిస్తున్న నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాలకు చెందిన పదిహేను ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో,అథ్లెటిక్స్ విభాగాలలో నిర్వహించబడతాయి. ఈ క్రీడలను నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, ఆర్మూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ఆఫ్ పోలీస్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ట్రస్మ రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, జిల్లా జనరల్ సెక్రెటరీ అరుణ్, కోశాధికారి మధు, నందిపేట్ మండల ట్రస్మా అధ్యక్షులు చుక్కబోట్ల దేవన్న, మండల జనరల్ సెక్రెటరీ సన్నీ, మండల కోశాధికారి మురళి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

  • బహుమతుల ప్రదానం..

నాలుగు రోజుల పాటు కొనసాగనున్న క్రీడల ప్రారంభంలో భాగంగా నిర్వహించిన మార్చ్ ఫస్ట్ విభాగంలో ప్రథమ బహుమతి గ్రేస్ ఫెలో షిప్ స్కూల్ వన్నెల్, ద్వితీయ బహుమతి సాయి విద్యానికేతన్, తొండాకూర్, జూనియర్ విభాగంలో ఉజ్వల స్కూల్ నందిపేట్ ప్రథమ బహుమతి, శ్రీ గీతా కాన్వెంట్ హై స్కూల్ నందిపేట్, ద్వితీయ బహుమతులు సాధించారు.

More articles

Latest article