క్రీడా దుస్తుల వితరణ

0 14,534

నందిపేట్, బతుకమ్మ: ఈనెల 28 శుక్రవారం నుండి 30 వరకు మైత్రి గ్రౌండ్స్ , పటాన్చెరు, మెదక్ జిల్లాలో జరిగే 44వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖో ఖో పోటీలలో నిజామాబాద్ క్రీడాకారులుపాల్గొననున్నారు. ఈ క్రీడాకారులకు బాలుర జట్టుకు శ్రీరామ ఎంటర్ప్రైజెస్ నిజామాబాద్ వారు క్రీడా దుస్తువులను అందజేశారు. అదేవిధంగా బాలికల జట్టుకి శ్రీ గీతా కాన్వెంట్ నందిపేట్ హై స్కూల్ వారు బాలికల కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్షులు జివి భూమా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి అతికుల్లా, ట్రెజరర్ మధు సూదన్ రెడ్డి, గీతా కాన్వెంట్ కరస్పాండెంట్ సాగర్  తదితరులు పాల్గొన్నారు.

Sportswear distribution

Leave A Reply

Your email address will not be published.