నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34మందికి రూ.3.35లక్షలు జరిమానా విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో 34మంది పట్టుబడ్డారని తెలిపారు. వీరిని కౌన్సిలింగ్ నిర్వహించి గురువారం కోర్టులో హాజరు పరుచగా స్పెషల్ జ్యూడిషియల్ రెండో క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహన్ బేగం, ఆర్మూర్ , బోధన్ మేజిస్ట్రేట్లు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.
